Skanda Songs : ‘స్కంద’ సెకండ్ సాంగ్ రిలీజ్.. ‘గందరాబాయి’ అంటూ రామ్, శ్రీలీల మాస్ డాన్స్..
'నీ చుట్టూ చుట్టూ తిరిగెనే' అంటూ మొదటి సాంగ్ లో స్టైలిష్ డాన్స్ వేసి అదరగొట్టిన రామ్ అండ్ శ్రీలీల.. ఈసారి సెకండ్ సాంగ్ గందరాబాయిలో..

Boyapati Sreenu Ram Pothineni Sreeleela Skanda Gandarabai song promo release
Skanda Songs : మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. ఇక రామ్ కి జంటగా శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్లింప్స్ అండ్ ఒక సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా సినిమాలోని సెకండ్ సింగల్ ప్రోమోని రిలీజ్ చేశారు.
Santosh Sobhan : నా మ్యారేజ్ మాత్రం అలానే చేసుకుంటా.. పెళ్లి పై సంతోష్ శోభన్ కామెంట్స్!
థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘గందరాబాయి’ అంటూ సాగే ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా నాకాష్ అజిజ్, సౌజన్య భగవతుల గానం చేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ ని కోరియోగ్రఫీ చేశాడు. ఇక మొన్న మొదటి సాంగ్ లో స్టైలిష్ డాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన రామ్ అండ్ శ్రీలీల.. ఈసారి మాస్ స్టెప్పులు వేసి విజుల్స్ వేయిస్తున్నారు. చిన్న ప్రోమోలోనే ఓ రేంజ్ స్టెప్పులు చూపించిన ఈ ఇద్దరు ఫుల్ సాంగ్ లో థియేటర్స్ ని దద్దరిలించడం ఖాయంలా కనిపిస్తుంది.
Nayanthara : షారుక్ ఖాన్ కోసం మనసు మార్చుకున్న నయన్..? ఏ విషయంలోనంటే..?
కాగా ఈ మూవీ పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఉండబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో సాంగ్స్ ని ఆ భాషల్లో కూడా తెలుగుతో పాటే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.