Brahma Anandam Teaser : ఆక‌ట్టుకుంటోన్న ‘బ్రహ్మా ఆనందం’ టీజ‌ర్..

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ లు వెండితెర‌పై తాత, మ‌నవ‌డిగా సంద‌డి చేయ‌నున్నారు. ‘

Brahma Anandam Teaser out now

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ లు వెండితెర‌పై తాత, మ‌నవ‌డిగా సంద‌డి చేయ‌నున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ పేరుతోనే ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఆర్‌.వి.ఎస్ నిఖిల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్ర‌లను పోషించారు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఒక నిమిషం 53 సెక‌న్ల నిడివితో ఉన్న ఈ టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Daaku Maharaaj Collections : వంద కోట్ల క్ల‌బ్‌లో బాల‌య్య మూవీ.. 4 రోజుల్లో ‘డాకు మ‌హారాజ్’ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

వెన్నెల కిశోర్, గౌత‌మ్‌ల కామెడీ అదిరిపోయింది. బ్ర‌హ్మానందం ఎంట్రీతో పాటు ఆయ‌న సీన్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.