Guttu Chappudu : బ్రహ్మాజీ తనయుడి నెక్స్ట్ సినిమా టీజర్ రిలీజ్.. ‘గుట్టు చప్పుడు’ కాకుండా..

తాజాగా గుట్టు చప్పుడు టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు.

Brahmaji Son Sanjay Rrao Movie Guttu Chappudu Teaser Released

Guttu Chappudu Teaser : బ్రహ్మాజీ(Brahmaji) తనయుడు సంజయ్ రావ్(Sanjay Rrao) ఇప్పటికే పిట్టకథ, స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడు తన మూడో సినిమా ‘గుట్టు చప్పుడు’తో రాబోతున్నాడు. డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డా॥ లివింగ్‌స్టన్‌ నిర్మాణంలో సంజయ్‌రావ్‌, ఆయేషాఖాన్‌ జంటగా మణీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుట్టు చప్పుడు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా ఉండబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా గుట్టు చప్పుడు టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ టీజర్ ని సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం లాంచ్ ఈవెంట్లో బ్రహ్మాజీ తన చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. మీరు కూడా ఈ గుట్టు చప్పుడు టీజర్ చూసేయండి.

ఇక టీజర్ లాంచ్ అనంతరం బ్రహ్మాజీ మాట్లాడుతూ… టైటిల్‌కు తగ్గట్టు సినిమాని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది అని తెలిపారు. నిర్మాత లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ… హనుమాన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారిని ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఖర్చు ఎక్కువైనా ప్రొడక్షన్ బాగుండాలనుకున్నాం. క్లైమాక్స్‌ ఫైట్‌ను 15 లక్షలతో అనుకోని క్వాలిటీ కోసం 75 లక్షలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో షూట్ చేసాం అని తెలిపారు.

 

హీరో సంజయ్‌రావు మాట్లాడుతూ… నాకు ఇది 3వ సినిమా. దర్శకుడు మణీంద్రన్‌, నిర్మాత లివింగ్‌స్టన్‌ నాకు మంచి మిత్రులు. వీరిద్దరి వల్లే నా జీవితభాగస్వామిని కూడా కలిసాను. అనుకున్న బడ్జెట్‌ కంటే భారీగా పెరిగినా తెరకెక్కిస్తున్నారు అని తెలిపారు.