Brahmanandam and Raja Goutham Brahma Anandam Movie Release Date Announced
Brahmanandam : సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను నవ్వించిన ఆయన ఇలా సినిమాలకు దూరంగా ఉండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కాస్త పూర్తి స్థాయి పాత్రతో త్వరలో రాబోతున్నారు బ్రహ్మానందం.
తన కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న బ్రహ్మ ఆనందం అనే సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవితంలో తండ్రికొడుకులైన ఈ ఇద్దరు సినిమాలో తాత మనవళ్లుగా కనిపించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. నేడు న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
బ్రహ్మ ఆనందం సినిమా 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ బ్రహ్మ ఆనందం సినిమా ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో తెరకెక్కుతుంది. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో బ్రహ్మానందం ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా రిలీజ్ చేసిన బ్రహ్మ ఆనందం పోస్టర్ చూస్తుంటే ఇందులో బ్రహ్మానందం మరింత ముసలివాడు అయినట్టు కనిపిస్తుండటంతో మనల్ని చిన్నప్పటి నుంచి నవ్వించిన కామెడీ కింగ్ అప్పుడే ముసలివాడు అయిపోతున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజా గౌతమ్ మను సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు బ్రహ్మ ఆనందం సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Sukriti Veni : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. థియేటర్స్ లో రిలీజ్ ఎప్పుడంటే..