Brahmanandam: ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నటనకు ఫిదా.. సన్మానం చేసిన మెగా ఫ్యామిలీ!

టాలీవుడ్‌లో హాస్యబ్రహ్మగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న లెజెండరీ కామెడీ యాక్టర్ డా.బ్రహ్మానందం ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన పాత్రలు, అవకాశాలను పూర్తిగా వినియోగించుకుని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో బ్రహ్మానందం ఆయనకు ఆయనే సాటి. అలాంటి నటుడు ఇటీవల చాలా తక్కువగా సినిమాలు చేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Brahmanandam: టాలీవుడ్‌లో హాస్యబ్రహ్మగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న లెజెండరీ కామెడీ యాక్టర్ డా.బ్రహ్మానందం ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన పాత్రలు, అవకాశాలను పూర్తిగా వినియోగించుకుని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో బ్రహ్మానందం ఆయనకు ఆయనే సాటి. అలాంటి నటుడు ఇటీవల చాలా తక్కువగా సినిమాలు చేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Brahmanandam : చచ్చేవరకు నేను కమెడియన్ నే.. మధ్యమధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటా..

అయితే, ప్రస్తుతం బ్రహ్మీ మాత్రం చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలకే ఓటేస్తున్నాడు. ఇక తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ సినిమా ఉగాది కానుకగా రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ లీడ్ రోల్‌లో నటించగా, బ్రహ్మానందం ఓ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన వారంతా, బ్రహ్మానందం పాత్రకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆయన పండించిన ఎమెషన్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిందంటూ ప్రేక్షకులు సినిమాలో ఆయన పాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు.

Brahmanandam : అప్పటి చదువులు ఇప్పుడు లేవు.. గురువులకు గౌరవం ఇవ్వట్లేదు.. విద్యావ్యవస్థపై బ్రహ్మానందం వ్యాఖ్యలు..

కాగా, తాజాగా బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన మెగా ఫ్యామిలీ ఆయన్ను సన్మానించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ డా.బ్రహ్మానందంను చిరు సత్కారంతో గౌరవించారు. రంగామార్తాండ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని ఈ సందర్భంగా వారు ఆయన్ను మెచ్చుకున్నారు. ఇక ఈ సత్కారానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుంత నెట్టింట వైరల్ అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC15 సెట్‌లో బ్రహ్మానందంకు ఈ సత్కారం చేసినట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు