Brahmanandam : చచ్చేవరకు నేను కమెడియన్ నే.. మధ్యమధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటా..

రంగమార్తాండలో బ్రహ్మానందం ఎమోషనల్ క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ లో బ్రహ్మానంద పాత్ర కమెడియన్ గా కాకుండా కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుందని అనిపిస్తుంది. బ్రహ్మానందం తన కెరీర్ లో చాలా అరుదుగా ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు మరోసారి..................

Brahmanandam : చచ్చేవరకు నేను కమెడియన్ నే.. మధ్యమధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటా..

Brahmanandam said he will always comedian until his life

Brahmanandam :  తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) అంటే తెలియని వారు ఉండరు. కామెడీ(comedy) కింగ్ బ్రహ్మానందం ఎన్నో సినిమాలలో తన కామెడీతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు. అయితే బ్రహ్మానందం గత కొంతకాలంగా రెగ్యులర్ గా సినిమాలు చెయ్యట్లేదు. చాలా అరుదుగా, సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా సినిమా ఈవెంట్లలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం కృష్ణవంశీ(Krishna vamsi) తెరకెక్కించిన రంగమార్తాండ(Rangamarthanda) సినిమాలో నటించారు.

రంగమార్తాండలో బ్రహ్మానందం ఎమోషనల్ క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ లో బ్రహ్మానంద పాత్ర కమెడియన్ గా కాకుండా కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుందని అనిపిస్తుంది. బ్రహ్మానందం తన కెరీర్ లో చాలా అరుదుగా ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు మరోసారి రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయబోతున్నారు. రంగమార్తాండ సినిమా ప్రివ్యూలు చూసిన వాళ్ళు కూడా బ్రహ్మానందం ఏడిపిస్తారు ఈ సినిమాతో అని అంటున్నారు. రంగమార్తాండ సినిమా ఉగాది కానుకగా నేడు మార్చ్ 22న రిలీజ్ కాబోతుంది. మంగళవారం రంగమార్తాండ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్, అలీ రాజా పాల్గొన్నారు.

Rangamarthanda : కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ప్రెస్ మీట్ గ్యాలరీ..

ఈ ప్రెస్ మీట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి కొంతమంది ఇలాంటి క్యారెక్టర్స్ ఇక నుంచి చేయండి అంటున్నారు. బాబోయ్ నా వాళ్ళ కాదు. నేను సాధారణంగా కమెడియన్ నే. నేను చచ్చేదాకా కమెడియన్ నే. కామెడీ చేస్తూనే ఉంటాను. ఎప్పుడో ఒకసారి మధ్యమధ్యలో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు తీసి జేబులో పెట్టుకుంటూ ఉంటాను. అంతే తప్ప నేను పూర్తిగా కమెడియన్ నే. బ్రహ్మానందం బ్రాండ్ కమెడియన్ అని అన్నారు. దీంతో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.