×
Ad

Vijay Devarakonda: బ్రహ్మాస్త్ర-2లో విజయ దేవరకొండ.. స్పందించిన డైరెక్టర్!

ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయిన సోషియో ఫాంటసీ మూవీ 'బ్రహ్మాస్త్ర పార్ట్-1' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మూడు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ సిరీస్ లో సెకండ్ పార్ట్ 'దేవ్' పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కీలకమైన దేవ్ పాత్రలో ఆ స్టార్ హీరో నటించబోతున్నాడంటూ పలువురు హీరోల పేరులు వినిపిస్తుండగా, తాజాగా ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఇచ్చాడు.

  • Published On : November 9, 2022 / 05:48 PM IST

Brahmastra Director Reacts on the Rumour of Vijay Devarakonda playing Dev Role in Part 2

Vijay Devarakonda: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్, అలియా భట్ జంటగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1’. ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మూడు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ సిరీస్ లో సెకండ్ పార్ట్ ‘దేవ్’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో టైటిల్ పాత్రను ఎవరు పోషించబోతున్నారు అని నెట్టింట చర్చ జరుగుతుంది.

Vijay Devarakonda: ‘ఖుషి’ మూవీని కూడా… విజయ్ దేవరకొండ ప్లాన్ ఏమిటో?

కీలకమైన దేవ్ పాత్రలో ఆ స్టార్ హీరో నటించబోతున్నాడంటూ రామ్ చరణ్, ప్రభాస్, యష్, హృతిక్ పేరులు వినిపిస్తుండగా, తాజాగా ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విజయ్ రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పాడని తెలియడంతో.. బ్రహ్మాస్త్ర పార్ట్-2 లో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు అనే వార్తలకు బలం చేకూర్చాయి.

దీంతో ఈ విషయం గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, అయన స్పందించాడు. దేవ్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు అనే వార్తలో నిజం లేదని కుండ బద్దలుకొట్టేశాడు. అలాగే దేవ్ పాత్రపై పెరుగుతున్న హైప్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మరి ‘బ్రహ్మాస్త్ర – దేవ్’లో ఏ హీరో నటించబోతున్నాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.