Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!
మే వరకు.. నెలకు ఒకటో, రెండో బిగ్ స్టార్స్ సినిమాలున్నాయి. వాటితో పాటే ఇప్పటికే కొన్ని లో బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఖర్చీఫ్ వేశాయి. ఆ తర్వాత ఆగస్ట్ నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా..
- Naresh Mannam
- Published On : April 1, 2022 / 11:21 AM IST
Movie Releases
Movie Releases: మే వరకు.. నెలకు ఒకటో, రెండో బిగ్ స్టార్స్ సినిమాలున్నాయి. వాటితో పాటే ఇప్పటికే కొన్ని లో బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఖర్చీఫ్ వేశాయి. ఆ తర్వాత ఆగస్ట్ నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా మొదలవుతుంది. మధ్యలో మిగిలిన జూన్, జూలై నెలల్లోనే యంగ్ హీరోలు, చిన్న సినిమాలు అడ్జస్ట్ అవక తప్పదు. అందుకే షూటింగ్ ఎప్పుడో పూర్తై రిలీజ్ కి రెడీ అంటున్న హీరోలు వర్షాకాలంలోనే సర్దుకుపోతామంటున్నారు.
Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!
ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు కేజీఎఫ్2, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 లాంటి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. మే వరకు ఈ సినిమాల హవా కొనసాగబోతుంది. వీటితో పాటే దొరికిన చిన్న గ్యాప్ లో గని, అశోకవనంలో అర్జున కల్యాణం, కృష్ణా వృందా విహారి, మేజర్ లాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చేస్తామని ప్రకటించాయి. ఆ తర్వాత ఆగస్ట్ లో లైగర్ తో మళ్లీ పెద్ద సినిమాల ట్రెండ్ రీస్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన స్టార్ట్ జూన్, జూలై నెలల్లో వచ్చేస్తామంటున్నారు.
Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!
జూన్ 10న అంటే సుందరానికి థియేటర్స్ కి రాబోతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. నాని కంటే ముందు జూన్ 3న కమల్ హాసన్ తన డబ్బింగ్ మూవీ విక్రమ్ తో కనిపించబోతున్నాడు. జూన్ 17న రవితేజ డ్యూటీ చేయబోతున్నాడు. తన రామారావ్ ఆన్ డ్యూటీని థియేటర్స్ కి తీసుకొస్తున్నాడు.
Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర
జూలై 1న గోపీచంద్, వైష్ణవ్ తేజ్ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. పక్కా కమర్షియల్, రంగ రంగ వైభవంగా సినిమాలు ఒకతే రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. జూలై 9న మాచర్ల నియోజక వర్గంతో థియేటర్స్ లో నితిన్ అడుగుపెడుతున్నాడు. జూలై 14న బైలింగ్వల్ ఫిల్మ్ ది వారియర్ ను చూపిస్తానంటున్నాడు రామ్. సో టాలీవుడ్ యంగ్ హీరోలందరూ మాక్సిమమ్ జూన్, జూలై నెలల్లోనే ఫుల్ గా సందడి చేయబోతున్నారు.
