British Indian Actress Amy Jackson Blessed with a Baby Boy
Amy Jackson : బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ గతంలో తెలుగు, తమిళ్ లో ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేసి బాబుని కని ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది అమీ జాక్సన్. కొన్నాళ్ల క్రితం అమీజాక్సన్ యూరప్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లి చేసుకొని యూరప్ లో సెటిల్ అయిపోయింది. కొన్ని నెలల క్రితం అమీ జాక్సన్ తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా అమీ జాక్సన్ తనకు బాబు పుట్టాడు అంటూ ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అమీ జాక్సన్ రెండోసారి తల్లి కావడంతో పలువురు సెలబ్రిటీలు, ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. బాబు ఫేస్ కనిపించకుండా ఫోటోలు షేర్ చేసి అమీ జాక్సన్ తన బాబు పేరు కూడా చెప్పేసింది.
Also Read : Robin Hood : నితిన్ సినిమాకి కూడా టికెట్ల రేటు పెంపు.. ఎంతంటే?
అమీ జాక్సన్ తన బాబుకి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్’ అని పేరు పెట్టింది. ఏకంగా ఆస్కార్ అవార్డు పేరుని తన కొడుకుకి పేరుగా పెట్టడంతో ఆశ్చర్యపోతున్నారు.