Bruce Willis: యాక్షన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రూస్ గుడ్ బై!

హాలీవుడ్ యాక్షన్ హీరో బ్రూస్ విల్లీస్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనారోగ్య కారణాలతోనే బ్రూస్ సినిమాలకు దూరం కావాల్సి వస్తుందని..

Bruce Willis: యాక్షన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రూస్ గుడ్ బై!

Bruce Willis

Updated On : April 1, 2022 / 10:44 AM IST

Bruce Willis: హాలీవుడ్ యాక్షన్ హీరో బ్రూస్ విల్లీస్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనారోగ్య కారణాలతోనే బ్రూస్ సినిమాలకు దూరం కావాల్సి వస్తుందని, అభిమానులు అర్థం చేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ‘ది ఫస్ట్డెడ్లీ సిన్’ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యాక్షన్ హీరోగా మెస్మరైజ్ చేశాడు బ్రూస్ విల్లీస్. తొలి సినిమాతోనే యాక్షన్ హీరో ముద్ర వేసుకున్న బ్రూస్ బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాలతో అలరించాడు.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

డై హార్డ్సిరీస్ ‘మెక్లేన్’, ‘ది ఫిఫ్త్ఎలిమెంట్’, ‘ది సిక్త్సెన్స్’, ‘ది లాస్ట్బాయ్స్కౌట్’, ’12 మంకీస్’ వంటి పలు సినిమాలలో నటించిన బ్రూస్.. రీసెంట్ గా రిలీజైన ‘ఎ డే టు డై’ ప్రాజెక్ట్ తో అట్రాక్ట్ చేశాడు. అయితే ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించి ఫ్యాన్స్ ను ఎమోషనల్ చేశాడు బ్రూస్.100 పైగా సినిమాల్లో నటించిన బ్రూస్ కెరీర్ పీక్స్ లో ఉండగానే అఫాసియా డిసీజ్ తో బాధపడుతున్నట్టు, సినిమాలకు దూరమవుతున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు అనౌన్స్ చేశారు.

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

మెదడులోని ఓ పార్ట్ డ్యామేజ్ కావడంతో అఫాసియా ఏటాక్ చేసింది బ్రూస్ ని. దీంతో సరిగ్గా మాట్లాడలేకపోతున్న బ్రూస్ సినిమాల్లో నటించరని.. ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలని ఆయన ఫ్యామిలీ చెప్పుకొచ్చింది. బ్రూస్ అనారోగ్య సమస్యలు.. సినిమాలకు దూరమవుతాడన్న దానిపై కొంత కాలంగా మూవీ లవర్స్ మధ్య ప్రచారం జరుగుతుండగానే.. దాన్ని నిజం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు బ్రూస్ మూవీ రిటర్మెంట్ ప్రకటించేశారు.