బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ నటిగా ప్రస్తుతం ఖాళీగా ఉన్నప్పటికీ, నిర్మాతగా మాత్రం సత్తా చాటుతోంది. తన సొంత నిర్మాణ సంస్థ క్లీన్‌స్లేట్ ప్రొడక్షన్స్‌లో చిత్రాలు నిర్మిస్తున్న అనుష్క ఇటీవల ‘పాతాళ్‌లోక్’ వెబ్‌సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆమె సంస్థ నుంచి రాబోతున్న మరో వెబ్ సిరీస్ ‘బుల్‌బుల్’.
‘స్వీయ శోధన, రహస్యం, కుట్ర, న్యాయాలకు సంబంధించి అతీంద్రియ శక్తులు ఉన్న బుల్‌బుల్ అనే అమ్మాయి అందమైన కథ’ అంటూ ఇప్పటికే ఆమె ప్రకటించగా.. నెట్‌ఫ్లిక్స్ ద్వారా జూన్ 24న విడుదల చేయనున్నారు వెబ్ సిరీస్.
‘బుల్‌బుల్’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ కథ చాలా పాత కాలంలో సెట్ చేయబడింది. తృప్తీ డిమ్రీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ‘బుల్‌బుల్’ పాత్రను పోషిస్తున్నారు. తృప్తి గతంలో లైలా మజ్ను వంటి సినిమాలలో నటించారు.
నటుడు రాహుల్ బోస్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బుల్‌బుల్ భర్త మహేంద్ర పాత్రలో నటించాడు. తృప్తితో పాటు అవినాష్ తివారీ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. వీరిద్దరూ గతంలో లైలా మజ్నులో కలిసి స్క్రీన్ పంచుకున్నారు.
Read: మైఖేల్ మళ్లీ వస్తున్నాడు.. విదేశాల్లో ‘బిగిల్’ రీ-రిలీజ్