Bullet Bhaskar said he gave Dubbing to Mahesh Babu in One Movie
Bullet Bhaskar – Mahesh Babu : జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బులెట్ భాస్కర్ తన మిమిక్రితో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. భాస్కర్ ఎక్కువగా మహేష్ బాబు వాయిస్ ని మిమిక్రి చేస్తుంటాడు. పలు ఈవెంట్స్ లో, జబర్దస్త్ లో కూడా అప్పుడపుడు భాస్కర్ మహేష్ వాయిస్ ని మిమిక్రి చేసాడు. అయితే ఓ సినిమాకు మహేష్ బాబుకి ట్రాక్ డబ్బింగ్ చెప్పాడట బుల్లెట్ భాస్కర్.
సాధారణంగా సాంగ్స్ కి మెయిన్ సింగర్ పాడే ముందు వేరే సింగర్ తో రఫ్ గా ఒక సారి పాడిస్తారు. అలాగే కొన్ని సినిమాలకు మెయిన్ హీరోలు డబ్బింగ్ చెప్పేముందు రఫ్ డబ్బింగ్ ఒక వర్షన్ చెప్పిస్తారు. డబ్బింగ్ ఎక్కడ ఎలా ఉండాలి అని సిమిలర్ వాయిస్ ఉన్న వాళ్ళతో చెప్పిస్తారు. ఆ తర్వాత అసలు హీరోలు అది చూసి డబ్బింగ్ చెప్తారు. అలా మహేష్ బాబు వన్ నేనొక్కడ్నే సినిమాకు బులెట్ భాస్కర్ తో చెప్పించారట.
తాజాగా బులెట్ భాస్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వన్ నేనొక్కడ్నే సినిమాకు నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను సినిమా మొత్తం. మహేష్ గారి వాయిస్ అచ్చు దించేసాను. తర్వాత మహేష్ బాబు గారు వచ్చి నా డబ్బింగ్ విని ఇంత బాగా చెప్పారు, ఎవరు చెప్పారు అని అడిగారట. మహేష్ బాబు గారు నా ఫేవరేట్ హీరో. నేను కృష్ణ గారి ఫ్యాన్ ని. ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. ఆయనతో ఒక్కసారి ఫోటో దిగాను అంతే. కలిసి మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.
Also Read : SSMB 29 : ఇదేంటి బ్రో.. రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ అంట.. మళ్ళీ షూటింగ్ ఎప్పుడంటే..?