SSMB 29 : ఇదేంటి బ్రో.. రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ అంట.. మళ్ళీ షూటింగ్ ఎప్పుడంటే..?
రాజమౌళి - మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంట.

Summer Holidays to Rajamouli Mahesh Babu Priyanka Chopra SSMB 29 Movie Shoot
SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ అవ్వగా గత సోమవారం నుంచి మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ఓ సెట్ లో మొదలైంది. ప్రస్తుతం మహేష్ – ప్రియాంక మీద ఓ పాటని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అయితే రాజమౌళి మహేష్ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంట. అవును మీరు విన్నది నిజమే. స్కూల్స్ కి, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కానీ మూవీ షూటింగ్ కి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అయితే ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ లో జరుగుతుంది. కాశీ సెట్ వేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నారట. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ కి గ్యాప్ రానుంది. మళ్ళీ తిరిగి జూన్ రెండో వారంలో మొదలుపెట్టనున్నారట.
టాలీవుడ్ సమాచారం ప్రకారం కాశీ సెట్ వేయడానికి ఎలాగో టైం పడుతుంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువ ఉన్నాయి, షూట్ కూడా బయటే అవుట్ డోర్ కాబట్టి మహేష్, ప్రియాంక, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ త్వరగా అలిసిపోతారు, ట్యాన్ అయిపోతారు అని కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. మొత్తానికి మహేష్ సినిమాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని 2027 లో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్.