Roja – Kirak RP : రోజాపై కిరాక్ ఆర్పీ కామెంట్స్.. జబర్దస్త్ వాళ్ళు ఎందుకు స్పందించలేదు.. బుల్లెట్ భాస్కర్ ఏమన్నాడంటే..
తాజాగా బులెట్ భాస్కర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావన వచ్చింది.

Bullet Bhaskar Tells about Why Jabardasth Teams Not Reacts about Kirak RP Comments on Roja
Roja – Kirak RP : రోజా ఒకప్పుడు జబర్దస్త్ లో జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు జబర్దస్త్ టీమ్ అందరితో రోజాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చాక రోజా జబర్దస్త్ మానేసింది. ఎన్నికల సమయంలో కూటమికి సపోర్ట్ గా కిరాక్ ఆర్పీ, ఆది లాంటి పలువురు రోజాపై కూడా విమర్శలు చేసారు. కిరాక్ ఆర్పీ అయితే రోజాపై, ఆ పార్టీ నాయకులపై రెగ్యులర్ గా విమర్శలు చేసారు. దీనిపై జబర్దస్త్ నుంచి ఎవరూ స్పందించలేదు.
తాజాగా బులెట్ భాస్కర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావన వచ్చింది. గతంలో కిరాక్ ఆర్పీ రోజా గారి మీద చాలా కామెంట్స్ చేసాడు. జబర్దస్త్ నుంచి ఎవరూ ఎందుకు స్పందించలేదు అని అడిగారు.
బుల్లెట్ భాస్కర్ సమాధానమిస్తూ.. జబర్దస్త్ అంతా ఒకటే ఫ్యామిలీ. కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలకు సంబంధించింది. జబర్దస్త్ కి సంబంధించి కాదు. అందుకే ఎవరూ స్పందించలేదు. వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. నేను అయితే స్పందించను. పాలిటిక్స్ అనేది పెంట లాంటిది. దాంట్లోకి వెళ్ళకూడదు. ఆర్టిస్ట్ ఒక పార్టీకి సపోర్ట్ ఇస్తే ఇంకో పార్టీ వాళ్లకు శత్రువులు అవుతాము. ఒక పార్టీకి సపోర్ట్ ఇస్తే ఇంకో పార్టీ వాళ్ళు ఈవెంట్స్ కి పిలవరు. ఒకప్పుడు నేను ఏమి అనకపోయినా ఓ వివాదంలోకి లాగి ఒక పార్టీ వాళ్ళు తిట్టారు. స్కిట్ లో ఏదో ఫ్లోలో అన్న డైలాగ్ ఒక పార్టీకి అన్నారని ఆ పార్టీ వాళ్ళు అనుకోని నాకు ఫోన్స్ చేసి బాగా ఇబ్బందిపెట్టారు. అక్కడ ఏం లేదు అయినా నన్ను టార్గెట్ చేసారు అని చెప్పుకొచ్చాడు.
గతంలో ఓ సారి బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వేసిన ఒక డైలాగ్ తమ పార్టీకే అనుకోని ఒక పార్టీ వాళ్ళు బుల్లెట్ భాస్కర్ ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం, బెదిరించడం చేసిన సంగతి తెలిసిందే. భాస్కర్ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో పెట్టేదాకా వదల్లేదు. అందుకే భాస్కర్ వివాదాలకు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటాను అని అన్నారు.
Also Read : Bromance : ‘బ్రొమాన్స్’ మూవీ రివ్యూ.. మిస్ అయిన అన్న కోసం తమ్ముడు ఏం చేసాడు.. నవ్వుకోవాల్సిందే..