Bullet Bhaskar : వామ్మో.. బుల్లెట్ భాస్కర్ దగ్గర అన్ని వందల వాచ్ లు ఉన్నాయా? ఖరీదైన వాచ్ లు పెట్టుకున్నందుకు తిట్టారంట..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన దగ్గర ఉన్న వాచ్ ల గురించి మాట్లాడారు బుల్లెట్ భాస్కర్ .

Bullet Bhaskar : వామ్మో.. బుల్లెట్ భాస్కర్ దగ్గర అన్ని వందల వాచ్ లు ఉన్నాయా? ఖరీదైన వాచ్ లు పెట్టుకున్నందుకు తిట్టారంట..

Jabardasth Bullet Bhaskar Tells about his Watches Collection

Updated On : May 2, 2025 / 1:11 PM IST

Bullet Bhaskar : కొంతమంది సెలబ్రిటీలు తమకు ఇష్టం అయినవి రెగ్యులర్ గా ఎక్కువగా కొంటూ ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు షూస్, బ్యాగ్ లు, వాచ్ లు.. ఇలాంటివి రెగ్యులర్ గా ఎక్కువగా కొంటూ ఉంటారు. అలాగే జబర్దస్త్ బులెట్ భాస్కర్ కి కూడా వాచ్ లు బాగా ఇష్టం అంట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన దగ్గర ఉన్న వాచ్ ల గురించి మాట్లాడారు.

బులెట్ భాస్కట్ మాట్లాడుతూ.. నాకు వాచ్ లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నా దగ్గర దాదాపు 300 వాచ్ లు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకున్నది 45 వేలు. ఒకసారి ఇంటర్వ్యూలో 25 వేలు పెట్టి వాచ్ పెట్టుకున్నాను అని చెప్తే కింద కామెంట్స్ లో బలిసినోడు, డబ్బులు ఉన్నాయని అంత పెట్టి కొన్నాడు అని తిట్టారు. ఒకప్పుడు సికింద్రాబాద్ రోడ్ మీద 100 రూపాయల వాచ్ లు కొనుక్కోవడానికి ఆలోచించాను. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఉన్నాయి, నచ్చింది కొనుక్కుంటున్నాను. నా ఒక్కో స్కిట్ లో ఒక్కో వాచ్ పెట్టుకుంటాను. నేను స్క్రీన్ మీద కనపడితేనే వాచ్ లు పెట్టుకుంటాను, అవసరమైనప్పుడే పెట్టుకుంటాను. బయట మాములుగా తిరిగితే ఎక్కువగా పెట్టను. మా ఆవిడ తిడుతుంది అన్ని కొన్నావు పెట్టుకోవు అని. నేను స్క్రీన్ మీదే సెలబ్రిటీ, అక్కడ పెట్టుకుంటే చాలు అని చెప్తాను అని తెలిపాడు.

Also See : Rana – Miheeka : భార్యతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రానా.. స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతున్నారుగా..

దీంతో బులెట్ భాస్కర్ దగ్గర 300 వాచ్ లు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. అంటే వాచ్ ల మీదే ఎంత డబ్బులు పెట్టారో అని కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర కూడా ఇన్ని వాచ్ లు ఉండవేమో.