Bullet Bhaskar : సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర అన్నారు.. 55 రోజులు డేట్స్ ఇచ్చా.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎందుకు ఎక్కువగా చేయరు అని అడగ్గా బుల్లెట్ భాస్కర్ సమాధానమిచ్చాడు.

Bullet Bhaskar said why he did not do So Many Movies as Actor

Bullet Bhaskar : జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ తో పాపులారిటీ తెచ్చుకున్నాడు బులెట్ భాస్కర్. అప్పుడపుడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపిస్తాడు. అయితే సినిమాల కంటే ఎక్కువగా టీవీ షోలు, బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎందుకు ఎక్కువగా చేయరు అని అడగ్గా బుల్లెట్ భాస్కర్ సమాధానమిచ్చాడు.

Also Read : Kingdom Song : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. ఒక సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర అన్నారు. 55 రోజులు డేట్స్ ఇచ్చాను. కానీ సినిమా రిలీజయ్యాక సినిమా మొత్తం మీద నాది ఒకటే డైలాగ్ ఉంది. ఆ 55 రోజులు సెట్ కి వెళ్లడం, తినడం, పడుకోవడం అంతే. నాకు గుర్తింపు వచ్చే పాత్రలు రావట్లేదు. అందుకే నేను సినిమాలు చేయను. వెయ్యి సినిమాలు చేసాము అని చెపుకునేకంటే గుర్తింపు వచ్చే పాత్ర ఒక్కటి చేయడం బెటర్. నా అంతట నేను సినిమాలు ప్రయత్నించను. ఎవరన్నా అడిగితే చేస్తాను. ముందు ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి. అందుకే జబర్దస్త్, బయట ఈవెంట్స్ లు చేసి ఆ తర్వాతే సినిమాలు నా ప్రిఫరెన్స్ అని తెలిపాడు.

అయితే 55 రోజులు డేట్స్ ఇస్తే సినిమాలో ఒకటే డైలాగ్ పెట్టింది ఏ సినిమానో మాత్రం చెప్పలేదు భాస్కర్.

Also Read : Allu Arjun : ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’.. అల్లు అర్జున్ టీ షర్ట్ మీద ఏముందో చూశారా? వైరల్ అవుతున్న వీడియో..