Kingdom Song : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..

Vijay Deverakonda Anirudh Ravichander Bhagyashri Bhorse Kingdom Movie First Song Released
Kingdom Song : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే కింగ్డమ్ సినిమా నుంచి గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ‘హృదయం లోపల..’ అంటూ సాగే పాటని విడుదల చేసారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..
ఇక ఈ సాంగ్ ని అనిరుధ్ సంగీత దర్శకత్వంలో కెకె రాయగా అనిరుధ్, అనుమిత నదేశన్ పాడారు. దార్ గై ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది.