Rrr
RRR : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మేనియానే నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రూపొందించిన భారీ మల్టిస్టారర్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న విడుదల కానుంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి టిక్కెట్స్ దొరికే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే కొన్ని ఏరియాలలో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ అయిపోయాయి. కొన్ని చోట్ల రేటు ఎక్కువగా ఉన్నా కూడా అభిమానులు టికెట్లని కొనుగోలు చేస్తున్నారు. మొదటి మూడు రోజులు అసలు టికెట్స్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఈ సినిమా టికెట్ల కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు. అయితే ఈ సినిమా క్రేజ్ ని పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడా వాడుకుంటున్నాయి. లోకల్ లో కూడా పలు వ్యాపార సంస్థలు ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ని వాడుకుంటున్నాయి.
Samantha : సమంత చేతిలో మరో కమర్షియల్ యాడ్..
తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ అభిమానులకి, ప్రేక్షకులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరుతో ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ గ్యాస్ ఏజెన్సీలో సింగిల్ గ్యాస్ సిలిండర్ కలిగిన వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్స్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. బ్యానర్లు ప్రింట్ చేయించి పలు సెంటర్లలో కట్టారు. ఇది చూసిన కొంతమంది సిలిండర్ కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే కొందరు వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా కొత్తగా ఆలోచించి వాళ్ళ బిజినెస్ ని కూడా పెంచుకుంటున్నారు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా క్రేజ్ ని వాడుకొని.