Bunny Vasu
Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు అల్లు అరవింద్ కాంపౌండ్ లోకి వచ్చి అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ గా మారి గీత ఆర్ట్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగారు. ఇప్పుడు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో జనసేన లో చేరి పార్టీ ప్రచార బాధ్యతలు కూడా తీసుకున్నారు.(Bunny Vasu)
తాజాగా బన్నీ వాసు 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇష్టం, ఆయనతో అనుబంధం చెప్తూ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also See : Singer Smita : భీమవరంలో పాప్ సింగర్ స్మిత.. రఘురామ కృష్ణరాజుతో కలిసి సంక్రాంతి సంబరాల్లో.. ఫొటోలు..
బన్నీ వాసు మాట్లాడుతూ.. నేను స్కూల్ లో ఉన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి అభిమానిని. నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక మా నాన్నగారికి చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా కార్ వేసుకొని కొంతమంది ఫ్రెండ్స్ తో పవన్ కళ్యాణ్ ని చూడటానికి హైదరాబాద్ వచ్చేసాం. అలాంటి పిచ్చ ఫ్యాన్ నేను. మొదట అరవింద్ గారి కాంపౌండ్ లోకి వచ్చాక ఎప్పుడెప్పుడు పవన్ గారిని కలుద్దామని ఎదురుచూసేవాడిని.
జల్సా సినిమాకు నన్ను ఎగ్జిగ్యూటివ్ నిర్మాతగా పరిచయం చేస్తే నేను పవన్ కళ్యాణ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ డే అరవింద్ గారి దగ్గరకు వెళ్లి జల్సా సినిమాకు చేయను, ఇంకో సినిమా చేస్తాను అని చెప్పాను. నీకు కళ్యాణ్ గారంటే ఇష్టం కదా చేసుకో అంటే నేను ఆయన ముందు నిలబడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, సరిగ్గా చేయలేను అని చెప్పాను.
పవన్ కళ్యాణ్ గారు కొన్ని చిన్న చిన్న విషయాల్లో తిడతారు మనం చేసే పనుల బట్టి. తిట్టినా నేను ఆయన్ని, పార్టీని వదలను. ఆయనకు కూడా తెలుసు నేను బాగా చేస్తాను అని. ఒకరోజు పిలిచి సినిమాలు, మీడియాలో ఉన్నావు కదా అని జనసేన ప్రచార బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల కౌంటింగ్ రోజు ఆయన కోసం చాలా మొక్కులు మొక్కుకున్నాను. ఆయన కోసం, పార్టీ కోసం ఇంకా తీర్చాల్సిన మొక్కులు ఉన్నాయి. ఇప్పటికి జనసేనతోనే ఉన్నాను. ఆయన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను. నేను ఎక్కడ ఉన్నా నా మనసు పవన్ గారితోనే ఉంటుంది అని తెలిపారు. దీంతో బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.