Bunny Vasu
Bunny Vasu : నిర్మాత, మెగా ఫ్యాన్ బన్నీ వాసు గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో కీలక వ్యక్తిగా ఉండి నిర్మాతగా ఎదిగిన సంగతి తెలిసిందే. బన్నీ వాసు ప్రస్తుతం నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే బన్నీ వాసు జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికలకు పార్టీ కోసం పనిచేసారు. బన్నీ వాసు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి, ఆయన స్పందిస్తూనే ఉన్నారు.(Bunny Vasu)
గతంలోనే బన్నీ వాసు జనసేన నుంచి 2024 లో ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆఫర్ కూడా వచ్చింది కానీ ఫైనాన్షియల్ గా సిద్ధంగా లేకపోవడం వల్ల పోటీ చేయలేదు అని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి బన్నీ వాసు పాలిటిక్స్ గురించి, జనసేన గురించి మాట్లాడారు.
Also Read : Vijay Deverakonda : సైలెంట్ గా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. కీర్తి సురేష్ ఫిక్స్..
బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు పోటీ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ నేను ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి. నేను ఎవర్ని డబ్బులు అడిగినా ఇస్తారు కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకున్నాను. లాస్ట్ టైం అందుకే వద్దు అనుకున్నాను. అలాగే నాకు ఇంకా సినిమా మీద ప్రేమ చావలేదు. ఇంకా ఇక్కడ ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని ఉంది. రెండు పడవల మీద కాలు వేయడం కష్టం నాకు. అందులోను నేను వెళ్ళేది జనసేన పార్టీ. ఆయన దగ్గరకు వెళ్తే డేడికేట్ అవ్వాలి. కళ్యాణ్ గారి దగ్గర మనం పనిచేస్తున్నాము అంటే మన దగ్గర్నుంచి ఆయన డెడికేషన్, మనం బాధ్యత తీసుకోవడం ఆశిస్తారు. నా వల్ల కాదు అని చెప్పడమే మంచిది కానీ అక్కడా ఇక్కడ కాలు వేయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో అయితే కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తాను, పోటీ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని తెలిపారు.
అయితే బన్నీ వాసు 2029లో జనసేన తరపున గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తారని సమాచారం. మరి అప్పటి వరకు బన్నీ వాసు ఫైనాన్షియల్ గా రెడీ అయి పోటీకి రెడీగా ఉంటారా? జనసేన నుంచి మళ్ళీ టికెట్ ఆఫర్ చేస్తారా చూడాలి.