Vijay Deverakonda : సైలెంట్ గా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. కీర్తి సురేష్ ఫిక్స్..

గతంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.(Vijay Deverakonda)

Vijay Deverakonda : సైలెంట్ గా విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. కీర్తి సురేష్ ఫిక్స్..

Vijay Deverakonda

Updated On : October 11, 2025 / 9:48 AM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో రాగా ఆ సినిమా పర్వాలేదనిపించింది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని ఇప్పుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాని మొదలుపెట్టాడు. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.(Vijay Deverakonda)

రూరల్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమా ఉండబోతుందని, కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే.. అంటూ రక్తంతో తడిచిన చేయి ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రమోషన్స్ లో తెలిపాడు.

Also Read : Pradeep Ranganathan : నేను పవన్ సర్ కి ఎంత ఫ్యాన్ అంటే.. తమ్ముడు సినిమా.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన తమిళ హీరో..

నేడు సైలెంట్ గా ఈ సినిమా ఓపెనింగ్ చేసారు. ఈ ఓపెనింగ్ కి మూవీ యూనిట్ అంతా హాజరైంది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్ నుంచి ఓ ఫోటో లీక్ అయి వైరల్ గా మారింది. గతంలో ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందని రూమర్స్ వచ్చాయి. నేడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్ లో కీర్తి సురేష్ ఉండటంతో ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.

Vijay Deverakonda

Also See : Kajal Aggarwal : భర్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..