Bunny Vasu : అల్లు అర్జున్ కథలు వినాలంటే అతను ఉండాల్సిందే.. బన్నీవాసు ఆసక్తికర వ్యాఖ్యలు..

ముఖ్య గమనిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి, హీరో విరాన్(వంశీ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Bunny Vasu Interesting Comments on Viran and Allu Arjun about Listening Stories

Bunny Vasu Comments :  విరాన్(Viran Muttamsetty), లావణ్య జంటగా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ముఖ్య గమనిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి నిర్మాత బన్నీ వాసు ముఖ్య అతిధిగా వచ్చాడు. ముఖ్య గమనిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి, హీరో విరాన్(వంశీ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు వంశీ(విరాన్) చిన్నప్పటి నుంచి తెలుసు. అతను కూడా గీతా ఆర్ట్స్ లో ఒక మెంబర్. మాతో కలిసి తిరిగి తర్వాత మాతో పాటు కథలు వినేవరకు ఎదిగాడు. నాతో పాటు బన్నీ సినిమాలకు కథలు వినేవాడు. బన్నీ గారికి ఈయన ఎంత ఇష్టం అంటే.. ఇవాళ కథలు ఎవరెవరు వింటున్నాం.. మీరు, నేను కాకుండా ఒకసారి వంశీ ని కూడా పిలవండి. తనకి కూడా వినిపిద్దాం అనేవారు. బన్నీకి అంత ఇష్టం వంశీ. సింపుల్ గా తన జడ్జిమెంట్ చెప్తాడు. ఒకప్పుడు 9 ఏళ్ళ క్రితం హీరో అవుతాను అన్న అని వంశీ చెప్పాడు. అది ఈ రోజు వచ్చింది. ఇందాక ఇక్కడికి వస్తుంటే కూడా బన్నీ కాల్ చేసి ఎక్కడున్నారు అని అడిగితే.. ఇలా వంశీ హీరోగా సినిమా చేస్తే ఆ ఈవెంట్ కి వెళ్తున్నా అని చెప్తే థ్యాంక్యూ సర్ మా వంశీని పుష్ చేస్తున్నందుకు అని చెప్పారు. అంత ఇష్టం తనంటే బన్నీకి అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ షూట్ నుంచి ఒక ఫోటో లీక్ అయింది. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Also Read : Indraja Shankar : ప్రముఖ కమెడియన్ ఇంట పెళ్లి బాజాలు