Indraja Shankar : ప్రముఖ కమెడియన్ ఇంట పెళ్లి బాజాలు
తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ నిశ్చితార్థం డైరెక్టర్ కార్తీక్ రాజాతో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Indraja Shankar
Indraja Shankar : కోలీవుడ్ కమెడియన్ రోబో శంకర్ కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్ రాజాతో ఎంగేజ్మెంట్ అయ్యింది. వీరి నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజకు.. డైరెక్టర్ కార్తీక్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల మధ్య జరిగిన వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంద్రజ కూడా నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. విజయ్ సినిమా బిగిల్, కార్తీ విరుమాన్, తెలుగులో పాగల్ సినిమాల్లో ఇంద్రజ నటించారు.
ఇంద్రజ తండ్రి రోబో మొదట మిమిక్రీ ఆర్టిస్ట్. ‘ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార’ రోబోకు టర్నింగ్ ఇచ్చిన సినిమా. ప్రస్తుతం తమిళ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన రోబో ఏడాదికి 10 సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కాగా ఇంద్రజ-కార్తీక్ రాజాల వివాహం నెలరోజుల్లోనే జరగనుందని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జంట నిశ్చితార్ధం ఫోటోలు చూసి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram