×
Ad

Bunny Vasu : గీతా ఆర్ట్స్ బంగారు కొండ విజయ్ దేవరకొండ.. బ‌న్నీ వాసు

బ‌న్నీవాసు (Bunny Vasu) మాట్లాడుతూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

Bunny Vasu speech in The Girlfriend Success Meet

Bunny Vasu : రష్మిక మందన్న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దీక్షిత్‌శెట్టి కీల‌క పాత్ర పోషించాడు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఈ చిత్ర స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నీవాసు (Bunny Vasu) మాట్లాడుతూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ‘అందరి తరపున విజయ్ భాయ్ థ్యాంక్యూ. గీతా ఆర్ట్స్ అంటే నీ సొంత సంస్థలా చూసుకుంటావు. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బయట విజయ్ దేవరకొండ అయితే మాకు బంగారు కొండ. గీతా ఆర్ట్స్ బంగారు కొండ విజయ్ దేవరకొండ.’ అని అన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాట‌లు ఫ్యాన్స్‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నాయి.

Adah Sharma: వాళ్ళు చంపేస్తాం అన్నారు.. వీళ్ళు కాపాడుతూ వచ్చారు.. అదా శర్మ షాకింగ్ కామెంట్స్

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గీత గోవిందం సినిమాలో న‌టించారు. ఈ చిత్రం వంద కోట్ల పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు బ‌న్నీ వాసు మాట్లాడిన మాట‌లను బ‌ట్టి గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాలో న‌టించ‌నున్నాడ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.