Buttabomma song Fame Bollywood Star Singer Armaan Malik Engaged with Aashna Shroff
Armaan Malik : బాలీవుడ్(Bollywood) స్టార్ సింగర్(Singer) అర్మాన్ మాలిక్ తెలుగు లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ముంబైకి చెందిన అర్మాన్ మాలిక్ చిన్నవయసులోనే టీవీ షోలతో మొదలుపెట్టి సింగర్ గా ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో అనేక సినిమాల్లో తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకొని వేరే పరిశ్రమల్లో కూడా పాడటం మొదలుపెట్టాడు. తెలుగులో రక్తచరిత్ర 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్మాన్ మాలిక్ తొలిప్రేమ సినిమాలో నిన్నిలా నిన్నిలా సాంగ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అలవైకుంఠపురంలో సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ తో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నాడు అర్మాన్.
అప్పట్నుంచి తెలుగులో, బాలీవుడ్ లో మరింత బిజీ అయి వరుసగా సినిమాల్లో పాటలు పాడేస్తున్నాడు. తాజాగా అర్మాన్ మాలిక్ తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆశ్నా ష్రాఫ్(Aashna Shroff) అనే అమ్మాయితో అర్మాన్ మాలిక్ నిశ్చితార్థం నిన్న ఆగస్టు 28న జరిగింది. ఆశ్నా ష్రాఫ్ బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా సెలబ్రిటీ. ఆష్నాకు ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన పలు కంపెనీలు కూడా ఉన్నాయి. ఆశ్నాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
Gautam Ghattamaneni : తండ్రి బాటలోనే తనయుడు.. MB ఫౌండేషన్ లో గౌతమ్ సేవలు..
దీంతో బాలీవుడ్ తో పాటు అన్ని పరిశ్రమల నుంచి అర్మాన్ మాలిక్ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కూడా ఈ కొత్త జంటకి అభినందనలు తెలుపుతున్నారు. అర్మాన్ – ఆశ్నా తమ ఎంగేజిమెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది ఇంకా ప్రకటించలేదు.