BVS Ravi : బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోలో హిట్స్ గా వచ్చి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని సైతం ఆశ్చర్యపరిచారు. మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, రవితేజ, ప్రభాస్, బన్నీ, దుల్కర్, సూర్య, రామ్ చరణ్, శర్వానంద్, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా సినీ, రాజకీయ ప్రముఖులందర్నీ తీసుకొచ్చి వారితో సరదాగా మాట్లాడి బోలెడు ఆసక్తికర విషయాలు తెలియచేసి అన్‌స్టాపబుల్ షోని పెద్ద హిట్ చేసారు.
అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లింది. అసలు ఈ షో బాలయ్యతో అనౌన్స్ చేసినప్పుడు బాలయ్య ఇలాంటి టాక్ షోనా అని అందరూ సందేహం వ్యక్తపరిచారు. కానీ అందరి అనుమానాలు పటాపంచలు చేసి బాలయ్య అదరగొట్టారు. తాజాగా ఈ షో గురించి రచయిత BVS రవి ఆసక్తికర విషయం తెలిపారు.
Also Read : Pawan Kalyan – Puri Jagannadh : పూరి జగన్నాధ్ తో పవర్ స్టార్ సినిమా..? నిర్మాతగానా? హీరోగానా?
అన్‌స్టాపబుల్ షోకి కూడా రచయిత BVS రవి పనిచేసారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ.. ఓ సారి అల్లు అరవింద్ గారు పిలిచి ఇలా ఆహాలో టాక్ షో అనుకుంటున్నాము. పెద్ద హీరోతో అనుకుంటున్నాము, నువ్వు రాయాలి అని అడిగారు. నాకు షోలు రాయడం రాదు అని చెప్పాను. ఫార్మేట్ చెప్తారు నువ్వు రాయి అన్నారు. ఎవరు హోస్ట్ అని అడిగితే అయిదుగురు పెద్ద హీరోల పేర్లు చెప్పారు. దాంట్లో బాలకృష్ణ పేరు కూడా ఉంది. దాంతో నేను బాలకృష్ణ గారు అయితే బెస్ట్ అని చెప్పాను. అల్లు అరవింద్ గారు ఆయనే ఎందుకు అని అడిగితే ఆయన అయితే అద్భుతంగా ఉంటుంది. బాలకృష్ణ టాక్ షో చేసారని తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా తెలుగు తెలిసిన వ్యక్తులు ఆ షోని చూస్తారు. తెలుగు తెలిసిన వాళ్లందరికీ బాలయ్య తెలుసు అని చెప్పినట్లు తెలిపారు.
అయితే మిగిలిన ఆ నలుగురు హీరోలు ఎవరో మాత్రం చెప్పలేదు. ఆయన చెప్పినట్టే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో తెలుగు టాక్ షోగా ఓటీటీలలో రికార్డులు సృష్టించింది. బాలయ్యలో ఉన్న సరదా కోణం కూడా అందరికి తెలిసింది.
Also Read : Balakrishna – NTR : బాలయ్య – ఎన్టీఆర్ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేవు.. అన్‌స్టాపబుల్ షోకి ఎన్టీఆర్ వస్తారు..