Pawan Kalyan – Puri Jagannadh : పూరి జగన్నాధ్ తో పవర్ స్టార్ సినిమా..? నిర్మాతగానా? హీరోగానా?

పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కు స్పెషల్ ఇంట్రెస్ట్‌.

Pawan Kalyan – Puri Jagannadh : పూరి జగన్నాధ్ తో పవర్ స్టార్ సినిమా..? నిర్మాతగానా? హీరోగానా?

Pawan Kalyan - Puri Jagannadh

Updated On : August 1, 2025 / 8:35 AM IST

Pawan Kalyan – Puri Jagannadh : పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కు స్పెషల్ ఇంట్రెస్ట్‌. వీళ్లిద్దరు కాంబోలో 2000 సంవత్సరంలో బద్రి మూవీ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ హిట్ అయింది. 2012లో తీసిన కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా అప్పుడున్న పరిస్థితుల్లో మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ పవన్ యాక్టింగ్, పూరి డైరెక్షన్‌లోని ఎనర్జీ, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అభిమానులు ఈ జోడీ నుంచి మరో బిగ్ బ్యాంగ్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Balakrishna – NTR : బాలయ్య – ఎన్టీఆర్ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేవు.. అన్‌స్టాపబుల్ షోకి ఎన్టీఆర్ వస్తారు..

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన సినిమా కెరీర్‌తో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు రిలీజ్ చేయగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లను పూర్తి చేసారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ, జనసేన పార్టీ కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు.

హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో యాక్టింగ్‌కు గ్యాప్ ఇస్తానని, వీలైతే ఏదైనా సినిమాకు తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నుంచి ప్రొడ్యూసర్‌గా చేస్తానన్నారు పవన్. అయితే రాజకీయ బాధ్యతల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసే అవకాశం ఉందని, అప్పుడు పూరి జగన్నాధ్‌తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే, అది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అయితే పూరితో చేసే సినిమా పవన్ నిర్మాతగా చేస్తాడా? హీరోగా చేస్తాడా అనే సందేహం నెలకొంది.

Also Read : Actress Kalpika: సినీ నటి కల్పికపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు.. కూతురి మానసిక పరిస్థితిపై ఆందోళన.. సాయం చేయాలని విన్నపం..

మరోవైపు పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా కోసం పూరి ప్లాన్ చేస్తున్నారనే గాసిప్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి పవన్ -పూరి కాంబో సినిమా సంగతేంటో తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.