Venkatesh Maha : కేజీఎఫ్ మూవీ పై కంచరపాలెం దర్శకుడు సంచలన కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!
టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. లైఫ్ యాంథాలజీగా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ దర్శకుడు ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో

Care of Kancharapalem fame Venkatesh Maha viral comments on kgf movie
Venkatesh Maha : టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. లైఫ్ యాంథాలజీగా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తరువాత కూడా వెంకటేష్ మహా.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి డిఫరెంట్ స్టోరీతోనే వచ్చాడు. తాజాగా ఈ దర్శకుడు ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహాతో పాటు టాలీవుడ్ లోని దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ కూడా పాల్గొన్నారు.
#Sharwa35 : శర్వానంద్ 35 అనౌన్స్.. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో వెరైటీగా చెప్పారు..
ఇక ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఇక్కడున్న మేము ఐదుగురం, మాలా సినిమాలు తీసే ఇండస్ట్రీలోని ఇంకొందరు డైరెక్టర్స్.. మేమందరం మా అభ్యుదయ భావాలను పక్కన పెట్టి వైలెన్స్ సినిమాలు తీస్తే వాళ్లకన్నా గొప్పగా తీయగలం, కానీ మేము అది చేయడం లేదు. కొన్ని విలువలతో కూడిన సినిమాలు తీస్తున్నాము వాటిని చూసి ఇవి ఓటిటి సినిమాలు అంటూ డీగ్రేడ్ చేస్తున్నారు. అదే సినిమా లాస్ట్ లో తవ్వినవాళ్లకి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి, ఆ బంగారాన్ని అంతా తీసుకోని వెళ్లి సముద్రంలో పడేసే నిచ్ కమీన్ గాడి మీద సినిమా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాము అంటూ కేజీఎఫ్ చిత్రం గురించి ఇన్‌డైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు.
వాటిని కమర్షియల్ సినిమాలు అంటున్నారు. అయితే ఇక్కడ మా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ కి రెట్టింపు లాభాలు తెచ్చి పెడుతున్నాయి. కానీ 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాలు.. బడ్జెట్ పై రెండు మూడు కోట్ల మాత్రమే తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ కమర్షియల్ గా ఏ దర్శకులు గొప్ప అంటూ కూడా ప్రశ్నించాడు. కాగా కేజీఎఫ్ పై చేసిన వ్యాఖ్యలు గురించి సోషల్ మీడియాలో వెంకటేష్ మహాని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి సినిమా ప్రతి ఒకరికి నచ్చాలని రూల్ లేదు. కానీ మీకు నచ్చలేదని దానిని డీగ్రేడ్ చేసి మాట్లాడడం తప్పు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
]
View this post on Instagram