Upendra : నోరు జారిన హీరో ఉపేంద్ర.. కేసు నమోదు.. వీడియో తొలగించా, క్షమించండి అంటూ సోషల్ మీడియాలో నటుడి పోస్ట్
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన చిత్రాలు కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.
Kannada Actor Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన చిత్రాలు కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. పలు టాలీవుడ్ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే.. తాజాగా బెంగళూరులో ఉపేంద్రపై కేసు నమోదు అయ్యింది.
ప్రజాకియా పేరుతో ఓ రాజకీయ పార్టీని ఉపేంద్ర స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లో లైవ్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ సామెతను చెప్పారు. ఓ ఊరు ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉంటారని, అలాగే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసే వారు ఉంటారన్నారు. వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రజలపై ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే నిజమైన దేశభక్తి అంటూ వ్యాఖ్యానించాడు.
Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయం చిరంజీవి, నిర్మాత గొడవ నిజమేనా..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..
ఉపేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలపై పలు ప్రజా సంఘాలు భగ్గు మన్నాయి. నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తమను ఆవేదనకు గురి చేశాయంటూ కొందరు బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు ఉపేంద్ర పై కేసు నమోదు చేశారు.
ఇక తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్ వీడియోను సైతం తన సామాజిక మాధ్యమాల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా లైవ్‌లో పొరబాటున నోరు జారి కొన్ని కామెంట్లు చేశాను. ఈ వ్యాఖ్యల కారణంగా కొంత మంది ఇబ్బంది పడ్డారని తెలిసి వెంటనే సదరు వీడియోను తొలగించాను. దయచేసి తనను క్షమించాలని అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
Karthik Dandu : విరూపాక్ష దర్శకుడు నుంచి మరో థ్రిల్లర్.. ఈసారి పురాణగాథలోని మిస్టరీ..