case filed on agent producer Anil Sunkara at hyderabad criminal court
Anil Sunkara : భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాని నిర్మించిన అనిల్ సుంకర.. ఆ మూవీ డిజాస్టర్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సమస్యలు వచ్చి పడ్డాయి. ఏజెంట్ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక హక్కుల కోసం విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్).. అనిల్ సుంకరకు 30 కోట్ల చెల్లించాడు. అయితే విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేశారు.
kamal Haasan : కమల్ గడ్డం పెంచడం వెనుక సీక్రెట్ అదే.. మణిరత్నంతో సినిమాపై అప్ డేట్ ఇచ్చేసాడు
దీంతో తనకి న్యాయం చేయాలంటూ నిర్మాతలను ఆశ్రయించాడు. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో భోళా శంకర్ రిలీజ్ సమయంలో నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ పై సిటీ సివిల్ కోర్టులో కేసుని నమోదు చేశాడు. అయితే ఇప్పుడు ఆ కేసు సివిల్ కోర్టు నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వచ్చింది. క్రిమినల్ కోర్టులో పలు సెక్షన్స్ కింద నిర్మాతల పై కేసు ఫైల్ అయ్యింది. రోజురోజుకి ఈ వివాదం ముదురుతూ వెళ్తుంది.
Jawan 2 : విక్రమ్ రాథోర్ పాత్రతో జవాన్ 2 కన్ఫార్మ్ చేసిన దర్శకుడు..
ఆల్రెడీ అనిల్ సుంకర నిర్మించిన ‘సామజవరగమన’ హక్కులను వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చి కొంత మేరకు నష్టాన్ని భర్తీ చేశారు. అయితే అది కేవలం కొంత మాత్రమే. భోళా శంకర్ హిట్ అయితే మొత్తం క్లియర్ చేద్దామని అనిల్ సుంకర భావించారట. కానీ ఆ మూవీ కూడా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంతలోనే డిస్ట్రిబ్యూటర్ సతీష్ క్రిమినల్ కోర్టు మెత్తులు ఎక్కడం అనిల్ సుంకరకి కొత్త తలనొప్పిగా మారింది. ఇక ఈ వివాదం వలన ‘ఏజెంట్’ మూవీ ఓటీటీకి రిలీజ్ కి నోచుకోవడం లేదు.