Saidharam Tej (1)
Case registered against Saidharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు అయింది. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, అతి వేగం ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 336, 184 ఎంవీ యాక్ట్ కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా రాయదుర్గం దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో స్పోర్ట్స్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద జరిగిన తీరును పోలీసులు విచారిస్తున్నారు.
Sai Dharam Tej: యాక్సిడెంట్‌కు గురైన బైక్ విలువెంతో తెలుసా..
ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. తాను రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే షాక్ కి గురి కావడంతో సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ ను ముందుగా హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. బైక్ పై వస్తున్న తేజ్.. బైక్ స్కిడ్ కావడంతో పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్ ఉండటంతో తలకు రక్షణ లభించింది. లేదంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని పోలీసులు అన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.