సూర్యకు రైతుల సన్మానం

హీరో సూర్య, దర్శకుడు కె.వి.ఆనంద్‌లను సన్మానించిన కావేరి డెల్టా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు..

  • Published By: sekhar ,Published On : September 27, 2019 / 06:56 AM IST
సూర్యకు రైతుల సన్మానం

Updated On : September 27, 2019 / 6:56 AM IST

హీరో సూర్య, దర్శకుడు కె.వి.ఆనంద్‌లను సన్మానించిన కావేరి డెల్టా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు..

తమిళ స్టార్ హీరో సూర్య, సయేషా జంటగా నటించిన తమిళ సినిమా.. ‘కాప్పాన్’.. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, ఆర్య ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించగా, కె.వి.ఆనంద్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగులో ‘బందోబస్త్’ పేరుతో సెప్టెంబర్ 20న విడుదలవగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

సినిమాలో వ్యవసాయం విశిష్టత, రైతుల యొక్క ప్రాధాన్యత చూపించిన విధానం అందర్నీ ఆకట్టుకోవడంతో రీసెంట్‌గా కావేరి డెల్టా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు హీరో సూర్య, దర్శకుడు కె.వి.ఆనంద్‌లను సన్మానించారు. రైతులు తమ పట్ల చూపించిన అభిమానానికి సూర్య, కె.వి.ఆనంద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also : సైరా నిడివి ఎంతో తెలుసా?

ఈ ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో బొమన్ ఇరానీ, సముద్రఖని, నాగినీడు, పూర్ణ తదితరులు నటించారు. సంగీతం : హేరిస్ జయరాజ్, కెమెరా : ఎమ్.ఎస్.ప్రభు, ఎడిటింగ్ : ఆంటొనీ.