RRR Bullet : ఒక్క పోస్టర్‌తో మీమ్స్ పేజీలకు పండగ..!

బుల్లెట్ వల్ల ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ బీభత్సంగా వైరల్ అవుతోంది..

Rrr Bullet

RRR Bullet: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్-రౌద్రం, రణం, రుధిరం’.. మంగళవారం చరణ్, తారక్ బుల్లెట్‌పై ఉన్న కొత్త పోస్టర్ వదిలారు. బుల్లెట్ వల్ల ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ బీభత్సంగా వైరల్ అవుతోంది.

RRR : రామ్ – భీమ్.. పోస్టర్ అదిరిందిగా..!

ట్రాఫిక్ నిబంధనల గురించి కాస్త క్రియేటివ్‌గా చెప్పడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారికి ఈ పోస్టర్‌ భలే ఉపయోగపడింది. చెర్రీ, తారక్ ఇద్దరికీ హెల్మెట్స్, బుల్లెట్‌కి సైడ్ మిర్రర్స్ పెట్టేశారు. నెంబర్ ప్లేట్ మిస్సింగ్ అంటూ ఆర్ఆర్ఆర్ టీం వారికి రివర్స్ పంచ్ ఇవ్వడంతో ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అయ్యింది.

ఇక పలువురు హీరోలు, క్రికెటర్ల అభిమానులు, మూవీ లవర్స్ అయితే మెదడుకి పదును పెట్టి, తమకు నచ్చిన వారిని ట్రిపుల్ ఆర్ బుల్లెట్ మీద ఎక్కించేస్తున్నారు. ‘పుష్ప’ లో బన్నీ బుల్లెట్ మీద ఉన్న సోలో స్టిల్ వెనుక ఆర్ఆర్ఆర్ బుల్లెట్ స్టిల్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సేమ్ బైక్ మీద ఉన్న స్టిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి..

RRR Poster : ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై పోలీస్ పంచ్.. పోలీసుల పంచ్‌పై రివర్స్ పంచ్!

‘ఎడిటర్స్ ఆన్ ఫైర్’ అంటూ.. ఎన్టీఆర్ – ప్రభాస్, పవన్ కళ్యణ్ – రామ్ చరణ్, దళపతి విజయ్ – అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ – కేన్ విలియమ్సన్, బ్రహ్మానందం – ఎం.ఎస్.నారాయణ, సునీల్ – వేణుమాధవ్, ధనుష్ – అనిరుధ్.. ఇలా తమకు నచ్చినవారిని ట్రిపుల్ ఆర్ బుల్లెట్ మీద ఎక్కించేస్తున్నారు. ఈ పిక్స్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇంకెంతమంది సెలబ్రిటీలు ఈ ట్రిపుల్ ఆర్ బుల్లెట్‌ ఎక్కి సవారీ చేస్తారో చూడాలి..