Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ మృతికి సినీ ప్రముఖుల సంతాపం..

Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..

Puneeth

Updated On : October 29, 2021 / 3:37 PM IST

Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. పునీత్ మృతితో క‌ర్ణాట‌క రాష్ట్ర వ్యాప్తంగా హై అల‌ర్ట్‌ ప్రకటించారు.

పునీత్ రాజ్ కుమార్ మరణంతో శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బెంగుళూరు అంతగా దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పునీత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

నటుడిగా ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్న పునీత్ 46 ఏళ్ల వయసులోనే దూరమవ్వడం బాధాకరం.. ‘వుయ్ మిస్ యూ పునీత్’ అంటూ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.