Naatu Naatu Song : ‘నాటు నాటు’ ఆస్కార్ నామినేషన్స్ పై ప్రముఖుల ప్రశంసలు..

ఇండియా ప్రేక్షకులంతా RRR ఎన్ని విభాగాల్లో నామినేట్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టే ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ దక్కించుకుంది...............

Celebrities praise for 'Natu Natu' Oscar nominations

Naatu Naatu Song :  ప్రపంచంలోనే అత్యున్నతమైన సినిమా అవార్డు ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రపంచంలోని సినిమా వాళ్లంతా కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ లో నిలిచినా చాలు అనుకుంటారు. ఈ సారి RRR పుణ్యమా అని ఆస్కార్ నామినేషన్స్ పై ఇండియన్ సినీ ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇండియా ప్రేక్షకులంతా RRR ఎన్ని విభాగాల్లో నామినేట్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టే ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ దక్కించుకుంది. మరి కొన్ని విభాగాల్లో ఆశించినా RRR నిలవలేదు. దీంతో కొంత నిరాశ చెందినా నాటు నాటు సాంగ్ నిలవడంతో ప్రేక్షకులు, నెటిజన్లు, సినీ ప్రేమికులు, సినీ, రాజకీయ ప్రముఖులు చిత్రయూనిట్, రాజమౌళి, కీరవాణిని అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వారి భావాలని తెలియచేస్తూ RRR టీంని ప్రశంసిస్తున్నారు.