Celebrity Cricket Carnival : సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 ఎప్పట్నుంచి?

సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2ని నవంబర్ లో నిర్వహించబోతున్నారు.

Celebrity Cricket Carnival : సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 ఎప్పట్నుంచి?

Celebrity Cricket Carnival Season 2 Details

Updated On : July 22, 2024 / 7:35 AM IST

Celebrity Cricket Carnival Season 2 : టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్(TCA) తరపున సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో నిర్వహించారు. అది మంచి సక్సెస్ అవడంతో ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2ని నవంబర్ లో నిర్వహించబోతున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ లు ఆడనున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల జరగగా ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్, యాంకర్ ఓంకార్.. పలువురు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. TCA 2006లో మొదలుపెట్టాం. ఇలా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా క్రికెట్ మ్యాచ్ లు పెట్టి చారిటీ ద్వారా సహాయం అందిస్తున్న సాయి కృష్ణ గారికి మా అందరి తరపున అభినందనలు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం చాలా కష్టం. సీజన్ 1 మంచి సక్సెస్ అవ్వడంతో నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నాము. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం మాములు విషయం కాదు. నవంబర్ 15, 16లో జరిగే ఈ క్రికెట్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని తెలిపారు.

Also Read : Yadamma Raju : తండ్రి కాబోతున్న పటాస్ యాదమ్మ రాజు..

హీరో తరుణ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మేము ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలిచాము. ఈ సీజన్ 2 కూడా గెలిచి ట్రోఫీ లిఫ్ట్ చేస్తాము. ఇక్కడున్న మా అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. త్వరలో సెప్టెంబర్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఉంటుంది అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. మాకు ఉన్న స్ట్రెస్ కి క్రికెట్ మ్యాచ్ రిలీఫ్ ఇస్తుంది. మేమంతా వర్క్ లేనప్పుడు క్రికెట్ గ్రౌండ్ లోనే కలుస్తాము. ఇటీవల ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో సీజన్ 1 ఆడటానికి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ చూసి ఆశ్చర్యపోయాము. సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా సక్సెస్ అవ్వాలని అన్నారు. ఇక ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో సీజన్ 1 మంచి సక్సెస్ అయింది. హీరో శ్రీకాంత్, తరుణ్ ముందు నుంచి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం ఆస్ట్రేలియా వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు అని తెలిపారు.