Sundeep Kishan : సందీప్ కిషన్ ‘మజాకా’లో పవన్ కళ్యాణ్ పై డైలాగ్.. కట్ చేసిన సెన్సార్ బోర్డు.. ‘ఖుషి’ రిఫరెన్స్ తో ఆ డైలాగ్ ఏంటో తెలుసా?

సందీప్ కిషన్ మజాకా సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఓ డైలాగ్ రాసారంట.

Censor Board Cuts Pawan Kalyan Dialogue from Sundeep Kishan Mazaka Movie

Sundeep Kishan – Pawan Kalyan : స్టార్ హీరోల రిఫరెన్స్ లు చాలా సినిమాల్లో ఉంటాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు, ఆయన సినిమా రిఫరెన్సులు అయితే బోల్డన్ని సినిమాల్లో ఉంటాయి. తాజాగా సందీప్ కిషన్ మజాకా సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఓ డైలాగ్ రాసారంట. కానీ ఆ డైలాగ్ ని సెన్సార్ బోర్డు వాళ్ళు తీసేయమని చెప్పడంతో తీసేయాల్సి వచ్చిందట.

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మజాకా సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Mirai : తేజ స‌జ్జ ‘మిరాయ్’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ వెల్ల‌డించిన చిత్ర‌బృందం..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నాన్న పాత్ర హీరోయిన్ నడుము చూసి షేక్ అయిపోతుంటే ఏమైయింది నాన్న అని అడుగుతాను. దానికి రావు రమేష్ గారు.. ఇప్పట్లో పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడ్డారో ఇప్పుడు అర్ధమౌతుంది అని అంటారు. పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమాలో నడుము సీన్ రిఫరెన్స్ తో ఆ సీన్ రాసుకున్నాము. కాకపోతే సెన్సార్ లో ఆ డైలాగ్ కట్ చేయించారు అని తెలిపారు. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటం, పిఠాపురం ఎమ్మెల్యే అనే పదం వాడటం వల్లే సెన్సార్ ఆ డైలాగ్ కి అభ్యంతరం చెప్పి కట్ చేయించినట్టు తెలుస్తుంది.

Also See : Ashika Ranganath : యాడ్ షూట్లో హీరోయిన్ ఆషికా రంగనాథ్.. వర్కింగ్ స్టిల్స్ చూశారా?

దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ డైలాగ్ ఉంటే థియేటర్స్ లో ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చేది అని భావిస్తున్నారు. పవన్ పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ ఉపముఖ్యమంత్రి అయ్యాక సోషల్ మీడియాలో అప్పట్లో పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇలా ఉండేవాళ్లు అంటూ పవన్ పాత సినిమాల వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళ మజాకాలో ఈ డైలాగ్ ఉంటే ఇది కూడా అలాగే వైరల్ అయ్యేదేమో.