Kiara Advani
Kiara Advani : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2. ఈ సినిమా ఆగస్టు 14 రిలీజ్ కానుంది. బాలీవుడ్ తో పాటు ఇక్కడ తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినిమాలో కియారా బికినీ వేసి అలరించనుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ లో కియారా బికినీ సీన్స్ చూపించారు. ఒక సాంగ్ లో కియారా బికినీ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. కియారా మొదటి సారి బికినీ వేస్తుండటంతో కియారా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం సెన్సార్ లో కియారా బికినీ సీన్స్ ని కట్ చేసారని తెలుస్తుంది.
వార్ 2 సినిమాకు రెండు సార్లు సెన్సార్ జరిగినట్టు సమాచారం. కియారా బికినీ సీన్స్ ని సెన్సార్ వాళ్ళు సగానికి సగం కట్ చేయమని చెప్పారంట. అలాగే కొన్ని డైలాగ్స్ కి, రక్తపాతం ఎక్కువగా ఉన్న విజువల్స్ కి కట్ చెప్పారంట. యాక్షన్ సీన్స్ కి మాత్రం ఎలాంటి కట్స్ చెప్పలేదు. దీంతో కియారా ఫ్యాన్స్ స్క్రీన్ పై కియారా బికినీ సీన్స్ లేనట్టేనా అని నిరాశ చెందుతున్నారు.
సెన్సార్ తర్వాత వార్ 2 సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 44 సెకండ్స్ ఉందట. తెలుగులో ఈ నిడివి మరింత తగ్గుతుందని సమాచారం. అసలు ఫస్ట్ వార్ 2 గ్లింప్స్ రిలీజయినప్పుడు కియారానే వైరల్ అయింది. కియారా బికినీ సీన్ వల్లే వార్ 2 సినిమాకి హైప్ వచ్చింది. కానీ ఇప్పుడు కియారా అద్వానీ బికినీ సీన్ నే సగానికి పైగా కట్ చేయడం గమనార్హం.
Also Read : NTR Fan : 10 టీవీ చొరవ.. దూరం నుంచి వచ్చిన మూగ అభిమానిని కలిసిన ఎన్టీఆర్.. ఫొటోలు, వీడియోలు వైరల్..