censor gives so many cuts to Shahrukh Khan Pathan movie
Pathan Censor Report : కింగ్ ఖాన్ షారుఖ్ నుంచి దాదాపు ఐదేళ్ళ తర్వాత రాబోతున్న యాక్షన్ మూవీ ‘పఠాన్’. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా జనవరి 25న వరల్డ్ వైడ్ గానూ, పాన్ ఇండియా రేంజ్ లోనూ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజైన ‘బేషరమ్ రంగ్’ అనే ఫస్ట్ సాంగ్ సినిమాని అనేక వివాదాల్లో పడేసింది. దీంతో పఠాన్ పై వరుస వివాదాలు ముసురుకోవడం టీమ్ ని ఆందోళనకు గురి చేసింది. పఠాన్ ని నిషేధించాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ గా మారింది. దాని ఎఫెక్ట్ లేటెస్ట్ గా వచ్చిన సెన్సార్ రిపోర్ట్ పై కూడా పడింది.
బేషరమ్ రంగ్ పాటకు కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. బహుత్ తాంగ్ కియా… అనే లైన్ లో సైడ్-పోజ్ లు, డ్యాన్స్ మూమెంట్ ల క్లోజప్ షాట్ లను తొలగించాలని సూచించారు. ఇప్పటికే చెలరేగిన వివాదాలు, నిరసనలకు చెక్ పెట్టేందుకు ఆర్ఏడబ్ల్యూ అనే పదం స్థానంలో ‘హమారే’ అని ‘లాంగ్డే లుల్లే’ ని తొలగించి ‘టూటే ఫుట్’తో ఫిల్ చేశారు.
అలాగే సినిమాలో పీయంఓ అనే పదం తొలగించారు. పీయం స్థానంలో 13 వేర్వేరు చోట్ల రాష్ట్రపతి లేదా మంత్రి అని పదాలను చేర్చారు. శ్రీమతి భారతమాత అనే పదాన్ని ‘హమారీ భరతమాత’గా, ‘అశోకచక్ర’ను వీర్ పురస్కారంగా మార్చారు. కేజీబీ అనే పదాన్ని యస్బీయూతో భర్తీ చేసారు. ఒక డైలాగ్ లో సోట్చ్ అనే పదాన్ని డ్రింక్ గా మార్చారు. మొత్తం మీద సెన్సార్ బోర్డు పఠాన్ మూవీకి 13 కట్స్ సూచించి సినిమాకి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.
చాలా రోజుల తర్వాత షారుఖ్ మూవీ వస్తుండటంతో ‘పఠాన్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ బోర్డు అయితే కట్స్ చెప్పింది మరి ట్రైలర్, సినిమా తర్వాత అయినా వివాదాలు రాకుండా ఉంటాయేమో చూడాలి.