IFFI 2023 : సినీ ఇండస్ట్రీ అభివృద్దికి కేంద్రం ఎన్ని కోట్లు ప్రకటించిందో తెలుసా?

గోవాలో ఇఫీ (IFFI 2023) వేడుకలను కేంద్రం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ వేడుకల్లో సినీ పరిశ్రమ అభివృద్దికి కేటాయించే బడ్జెట్‌పై పరిమితిని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.

IFFI 2023

IFFI 2023 : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2023) 54 వ వార్షికోత్సవ వేడుకలు గోవాలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో సినీ పరిశ్రమ అభివృద్దికి కేటాయించే బడ్జెట్‌పై పరిమితిని పెంచుతూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

గోవా వేదికగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్రం ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ స్టువార్ట్ గట్ విచ్చేసారు. మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, శ్రీయా శరణ్, సుస్రత్ బరుచా, పంకజ్ త్రిపాఠి, శ్రేయా ఘోషల్, సుఖ్విందర్ సింగ్, శంతను మోయిత్రా వంటి వారు వేడుకలకు హాజరై ప్రదర్శనలు ఇచ్చారు.

ఇఫీ వేడుకల్లో మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. భారతీయ సినిమా అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్న ఆయన గతంలో రూ.2.5 కోట్లుగా ఉన్న బడ్జెట్ పరిమితిని రూ.30 కోట్ల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్‌లో విదేశీ సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించేలా భారీ ప్రోత్సాహకాలను పెంచినట్లు ఆయన చెప్పారు.

Also Read : ఈ వారం థియేటర్స్‌లో తెలుగులో రిలీజయ్యే అయ్యే సినిమాలు ఇవే..

ఇఫీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు 19 రాష్ట్రాల నుంచి వచ్చిన 75 మంది ప్రముఖులు పనిచేస్తున్నారని.. ఓటీటీ విభాగంలో 10 భాషల నుంచి 32 సినిమాలు ఎంపిక కాగా.. బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డును కూడా ఇస్తున్నామని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.