Theatrical Movies : ఈ వారం థియేటర్స్‌లో తెలుగులో రిలీజయ్యే అయ్యే సినిమాలు ఇవే..
గత కొన్ని రోజులుగా అన్నీ మీడియం సినిమాలే థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ వారం కూడా మీడియం సినిమాలే ఉండగా ఒక పెద్ద డబ్బింగ్ సినిమా కూడా ఉంది.

November fourth Week Theatrical Releasing Telugu Movies Full List
Theatrical Movies : గత వారం వచ్చిన సినిమాల్లో మంగళవారం(Mangalavaaram) మంచి విజయం సాధించింది. గత కొన్ని రోజులుగా అన్నీ మీడియం సినిమాలే థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ వారం కూడా మీడియం సినిమాలే ఉండగా ఒక పెద్ద డబ్బింగ్ సినిమా కూడా ఉంది.
వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), శ్రీలీల(Sreeleela) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదికేశవ’. మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ ఇందులో విలన్ గా నటిస్తూ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆదికేశవ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో సంయుక్తంగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతుంది. నవంబర్ 24న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
గౌతమ్ మీనన్(Gautham Vasudev Menon) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్.. లాంటి పలువురు స్టార్స్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ధ్రువ నక్షత్రం సినిమా 2017లోనే రిలీజ్ కావాల్సి ఉండగా అప్పట్నుంచి వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. నవంబర్ 24న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాబోతుంది.
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నయాట్టు’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘కోటబొమ్మాళి PS’. ఈ సినిమాకు బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24 థియేటర్స్ లో రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లింగిడి లింగిడి అనే సాంగ్ సూపర్ హిట్ అయింది.
VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు నిర్మాతలుగా సంజయ్ శేరి దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.
వీటితో పాటు పర్‌ఫ్యూమ్, మాధవ్ మధుసూధన, ది ట్రయిల్.. అనే పలు చిన్నా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.