OTT : ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్ చేసిన కేంద్రప్రభుత్వం.. అలాగే పేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్..

ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్ చేసిన కేంద్రప్రభుత్వం. అలాగే పేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్ అకౌంట్స్ ని కూడా..

Central Government block 18 ott platforms and social media accounts

OTT : ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ రంగం అంతా ఓటీటీ కల్చర్ పైనే ఎక్కువ కొనసాగుతుంది. థియేటర్స్‌లో, టెలివిజన్స్‌లో వచ్చే కంటెంట్ కంటే.. ఓటీటీ కంటెంట్ కి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అందుకు కారణం కూడా ఉంది. థియేటర్ అండ్ టెలివిజన్ రంగంలో వచ్చే సినిమాలోని కొన్ని సన్నివేశాలకు, సంభాషణలకు పరిమితులు ఉంటాయి. కానీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లో ఆ పరిమితికి కొంచెం స్వేచ్ఛ ఉంటుంది.

దీంతో ఓటీటీలో వచ్చే కంటెంట్స్ లో అడల్ట్ సన్నివేశాలు, అసభ్యకర మాటలు ఎక్కువుగా కనిపిస్తూ, వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ఈ కంటెంట్ ఇప్పటి యువతిని ఆకర్షిస్తూ తప్పుదారి పట్టించేలా చేస్తుంది. ఇలాంటి కంటెంట్ పై ప్రసారం చేసే ఓటీటీల పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వం.. అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారం చేస్తున్న కొన్ని ఓటీటీల జూలు విదిలించింది.

Also read : Theatrical Movies : రేపు రిలీజయ్యే సినిమాలు ఇవే.. ఒకే రోజు ఏకంగా పది సినిమాలు..

ఓటీటీలో అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారం చేస్తున్న ప్లాట్‌ఫార్మ్స్ పై.. ఐటి చట్టం, భారతీయ శిక్షాస్మృతి ,మహిళల అసభ్య ప్రచార నిషేధ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా 18 ఓటీటీలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. అలాగే ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కి చెందిన 12 ఫేస్ బుక్ అకౌంట్స్, 17 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్, 16 ఎక్స్ ట్విట్టర్ అకౌంట్స్, 12 యూట్యూబ్ అకౌంట్స్ ని కూడా బ్లాక్ చేసారు.

వీటితో పాటు 19 వెబ్ సైట్స్, పది యాప్‌లను కూడా బ్లాక్ చేసింది. నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వివరాలకు వస్తే.. డ్రీమ్ ఫిల్మ్, వూవి, ఎస్మా, నియోన్ ఎక్స్ విఐపి, మూడ్ ఎక్స్, మోజ్ ఫ్లిక్స్, హాట్ షాట్స్ విఐపి, హంటర్స్, బేషరమ్స్, అన్ కట్ అడ్డా, రాబిట్, ఫుగి, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ట్రా మూడ్, చికుఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, న్యూ ఫ్లిక్స్, ప్రైమ్ ప్లే ఓటీటీలను బ్లాక్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు