Theatrical Movies : రేపు రిలీజయ్యే సినిమాలు ఇవే.. ఒకే రోజు ఏకంగా పది సినిమాలు..
ఈ వారం మాత్రం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఒకేసారి ఏకంగా 10 సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.

Vey Daruvey Tantra Sharathulu Varthisthai and almost 10 films releasing this week in Theaters
Theatrical Movies : ఫిబ్రవరి, మార్చ్ నెలలు సినిమాలకు చాలా అన్ సీజన్. అయినా ఫిబ్రవరిలో కొన్ని పెద్ద సినిమాలే రిలీజయినా మార్చ్ లో మాత్రం మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరో పక్క స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ జరుగుతుండటంతో పెద్ద, మీడియం సినిమాలు కూడా ఏవి థియేటర్స్ లోకి రావట్లేదు. గత వారం వచ్చిన సినిమాల్లో గామి, ప్రేమలు మంచి విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ వారం మాత్రం అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. ఒకేసారి ఏకంగా 10 సినిమాల వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.
హీరో సాయిరామ్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ ‘వెయ్ దరువెయ్’ సినిమాతో మార్చ్ 15న వస్తున్నాడు. కొత్త దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో ఎంటర్టైనర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా కూడా మార్చ్ 15న రిలీజ్ అవుతుంది.
నిజం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన కథాంశం మీద యాట సత్యనారాయణ దర్శకత్వంలో ‘రజాకార్’ అనే సినిమా మార్చ్ 15న రాబోతుంది. ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, ఇంద్రజ, అనసూయ.. పలువురు స్టార్స్ నటించారు.
అనన్య నాగళ్ళ మెయిన్ పాత్రలో నటించిన హారర్ సినిమా ‘తంత్ర’ కూడా రేపు మార్చ్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ సలోని ముఖ్య పాత్ర పోషించింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి మెయిన్ లీడ్ లో నటిస్తున్న లవ్ థ్రిల్లర్ స్టోరీ ‘లంబసింగి’ కూడా రేపు మార్చ్ 15న రిలీజ్ అవుతుంది.
త్రిగున్ హీరోగా లైన్ మేన్స్ కష్టాలతో పాటు ఓ ఎమోషన్ తో తెరకెక్కిన ‘లైన్ మెన్’ సినిమా కూడా రేపు రిలీజ్ కాబోతుంది.
వీటితో పాటు ఎస్తర్ నోరాన్హా ‘మాయ’ సినిమా, ‘రవికుల రఘురామ’, ‘స్వామి నాగుల కొండ’.. అనే పలు చిన్న సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో థియేటర్స్ లో ఏది నిలబడుతుందో చూడాలి.