Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి డ్యాన్స్ వేసిన కేంద్ర మంత్రి

రణ్‌వీర్‌ అతిధిగా వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ని ఓ స్టెప్ వేయమని అడిగాడు. బాలీవుడ్ లోని ఓ పాపులర్ సాంగ్ మల్హరి అనే సాంగ్‌కి బాలీవుడ్ నటుడు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు.

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి డ్యాన్స్ వేసిన కేంద్ర మంత్రి

Ranveer

Updated On : March 29, 2022 / 12:36 PM IST

Dubai Expo :  అప్పుడప్పుడు కొన్ని వేదికలపై రాజకీయ నాయకులు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. తాజాగా ఓ కేంద్ర మంత్రి బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ఠాకూర్ దుబాయ్ లో జరుగుతున్న దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. అదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ కూడా పాల్గొన్నారు.

 

ఈ వేదికపై రణ్‌వీర్‌సింగ్‌ హోస్ట్ గా వ్యవహరించారు. దీంతో రణ్‌వీర్‌ అతిధిగా వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ని ఓ స్టెప్ వేయమని అడిగాడు. బాలీవుడ్ లోని ఓ పాపులర్ సాంగ్ మల్హరి అనే సాంగ్‌కి బాలీవుడ్ నటుడు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. రణ్‌వీర్‌సింగ్ తన హిట్ సాంగ్‌ మల్హరికి ఒక్క స్టెప్పు వేయమని పక్కనే ఉన్న కేంద్రమంత్రిని కోరారు. దీంతో మంత్రి కూడా రణ్‌వీర్‌సింగ్ తో కలిసి స్టేజిపై స్టెప్ వేశారు. ఆ తర్వాత రణ్‌వీర్‌సింగ్ మంత్రితో చేతులు కలిపారు.

Online Cinema Tickets : ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టిక్కెట్లు.. మొత్తం రెడీ అంటున్న ఏపీ ప్రభుత్వం..

హీరోతో కలిసి సెంట్రల్ మినిస్టర్ అనురాగ్‌ ఠాకూర్ చేసిన డ్యాన్స్ వీడియోని తన టీం అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ..”పవర్ అఫ్ బాలీవుడ్ అన్ని అడ్డంకుల్ని అధిగమిస్తుంది. మంత్రి అనురాగ్ ఠాకూర్ హీరో రణ్‌వీర్‌సింగ్ తో కలిసి డ్యాన్స్ చేశారు”అంటూ పోస్ట్ చేశారు. హీరోతో సెంట్రల్ మినిష్టర్ దుబాయిలో స్టెప్ వేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.