స్వర్గపురి వాహనంపై సిగరెట్ తాగుతూ.. బస్తీ బాలరాజు!
యంగ్ హీరో కార్తికేయ బస్తీ బాలరాజు నటిస్తున్న‘చావు కబురు చల్లగా’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

యంగ్ హీరో కార్తికేయ బస్తీ బాలరాజు నటిస్తున్న‘చావు కబురు చల్లగా’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..
‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’, ‘ప్రతిరోజూ పండగే’, వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా ‘‘చావు కబురు చల్లగా’’.. అనే చిత్రం తెరకెక్కబోతోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్తికేయ లుక్ విడుదల చేశారు. గల్లా చొక్కా, లుంగీలో స్వర్గపురి వాహనంపై స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నాడు కార్తికేయ. వెహికల్‌పై ‘‘గంగమ్మ దీవెన.. బస్తీ బాలరాజు.. స్వర్గపురి వాహనము ఏ/సి’’ అని రాసి ఉంది.
‘‘చావు కబురు చల్లగా’’ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్యానర్ : GA 2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : బన్నీ వాసు
సహ నిర్మాత : సునీల్ రెడ్డి
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి.