Chadalavada Srinivasarao Comments in Vijay Kanishka Movie Opening Event
Chadalavada Srinivasarao : విజయ్ కనిష్క, గరిమ చౌహన్ జంటగా సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో హనుమాన్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘కలవరం’. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ హాజరయ్యారు.
Also Read : Ram Charan – Aravind : నాన్న, బాబాయ్ లతో వెళ్ళను.. ఆ విషయంలో అరవింద్ మామ బెస్ట్.. చరణ్ ఆసక్తికర కామెంట్స్..
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాంకలో సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ కథ నాకు ముందే తెలుసు. బాలచందర్, భాగ్య రాజా లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఇది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఇప్పటిదాకా చిన్న సినిమాలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైనా చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వాలి. మినీ థియేటర్లు కట్టాలి అని అన్నారు. దీంతో ఈయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఈ సినిమా డైరెక్టర్ హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ.. ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి చెప్పారు. వెంటనే చెన్నై వెళ్లి హీరోకి కథ చెప్పగానే ఓకే చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు. హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ.. మా నాన్న విక్రమం గారు తమిళ్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలు కూడా తీశారు. నా ఫస్ట్ సినిమా హిట్ లిస్ట్ చూసి తండ్రి పేరు నిలబెట్టారు అన్నారు. ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను అని అన్నారు.
Also Read : Allu Arjun: మళ్లీ పోలీస్ స్టేషన్‌కు సినీ హీరో అల్లు అర్జున్.. అక్కడికి వెళ్లొద్దంటూ నోటీసులు..!
నిర్మాత శోభారాణి మాట్లాడుతూ.. కలవరం టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. డైరెక్టర్ హనుమాన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియచేస్తాము అని అన్నారు.