Allu Arjun: మళ్లీ పోలీస్ స్టేషన్‌కు సినీ హీరో అల్లు అర్జున్.. అక్కడికి వెళ్లొద్దంటూ నోటీసులు..!

సినీహీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ కు వెళ్లి సంతకం చేశారు.

Allu Arjun: మళ్లీ పోలీస్ స్టేషన్‌కు సినీ హీరో అల్లు అర్జున్.. అక్కడికి వెళ్లొద్దంటూ నోటీసులు..!

Allu Arjun

Updated On : January 5, 2025 / 11:15 AM IST

Chikkadpally Police Station : పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అయితే, మధ్యంతర బెయిల్ పై ఆయన కొద్ది గంటల్లోనే జైలు నుంచి బయటకు వచ్చారు. గత రెండురోజుల క్రితం అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం పలు షరతులు విధించింది.

Also Read: Ram Charan : కూతురు గురించి మాట్లాడుతూ బాలయ్య షోలో ఏడ్చేసిన రామ్ చరణ్.. క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటే..

అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. రూ.50వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగతంగా హాజరై సంతకం చేయాలని కోర్టు షరతుల్లో పేర్కొంది. అయితే, ఇప్పటికే నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అల్లు అర్జున్ వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఆదివారం ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. స్టేషన్ లో సంతకం చేశారు. పది నిమిషాల తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Also Read: Pawan Kalyan : రామ్ చరణ్ పేరు వెనక కథ చెప్పిన పవన్.. సంవత్సరంలో 100 రోజులు మాలలోనే.. చెప్పులు లేకుండా..

మీరెళ్లొద్దంటూ పోలీసుల నోటీసులు..
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవంతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ను పరార్శించేందుకు మీరు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.