Chaitanya Akkineni: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది -నాగ చైతన్య

సాయిధరమ్ తేజ్, నాగచైతన్య.. ఇటీవలికాలంలో వార్తల్లో ఎక్కువగా కనిపించిన హీరోలు.

Naga Chaitanya

Chaitanya Akkineni: సాయిధరమ్ తేజ్, నాగచైతన్య.. ఇటీవలికాలంలో వార్తల్లో ఎక్కువగా కనిపించిన హీరోలు.. యాక్సిడెంట్ కారణంగా సాయిధరమ్ తేజ్ వార్తల్లోకి ఎక్కగా.. సమంతతో విడాకుల వార్తలతో నాగ చైతన్య హాట్ టాపిక్ అయ్యారు. దాదాపు 20రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ కోలుకుని నేను బాగానే ఉన్నా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపిస్తూ.. ఇప్పుడు అంతా ఓకే అన్నట్లుగా కామెంట్ చేశారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి థాంక్స్ అనే పదం చిన్నదవుతుందంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టారు. రిపబ్లిక్ సినిమాని హిట్ల చేసినందుకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు.

ఈ ట్వీట్‌పై సెలబ్రిటీలు వరుసగా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే అక్కినేని హీరో నాగచైతన్య కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్ తేజ్ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ.. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేశారు. చైతన్య తన విడాకుల ప్రకటన ట్వీట్ చేసిన తర్వాత చేసిన నెక్స్ట్ ట్వీట్ ఇదే.