×
Ad

Dil Diya First Look: ‘దిల్ దియా’ మూవీలో నగ్నంగా చైతన్య రావు.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందీప్ రెడ్డి వంగ

చైత‌న్య‌రావు మ‌దాడి హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న దిల్ దియా మూవీ ఫస్ట్ లుక్(Dil Diya First Look) ను సందీప్ రెడ్డి వంగ విడుదల చేశాడు.

Chaitanya Rao Dil Diya movie first look released by sandeep reddy vanga

  • దర్శకుడు క్రాంతి మాధవ్ కొత్త మూవీ ‘దిల్ దియా’
  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందీప్ రెడ్డి వంగ
  • పోస్టర్ లో న్యూడ్ గా చైతన్య రావు

Dil Diya First Look: రొటీన్ కి బిన్నంగా సినిమాలు చేసే నటుడు చైత‌న్య‌రావు మ‌దాడి. ఇప్పుడు మరోసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. అదే ‘దిల్ దియా(Dil Diya First Look)’ మూవీ. ‘ఏ నేక్డ్ ట్రుథ్’ అనేది ట్యాగ్ లైన్. రా అండ్ రూటెడ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నాడు. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Thalaivar 173: రజనీ-కమల్‌ మూవీ అప్డేట్.. యంగ్ డైరెక్టర్‌కి ఛాన్స్‌.. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశాడు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దిల్ దియా ఫస్ట్ లుక్ విషయానికి వస్తే..నటుడు చైతన్య ఈ పోస్టర్ లో ఒంటిపైన బట్టలు లేకుండా న్యూడ్ గా కనిపించాడు. లాంగ్ హెయిర్, గెడ్డంతో సోఫాలో కూర్చొని సినిమా చూస్తున్నట్టుగా ఉంది ఈ పోస్టర్.

దీంతో, ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ‘దిల్ దియా’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ సంద‌ర్భంగా నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ.. ‘క్రాంతి మాధవ్ సినిమాలు డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్‌, సెన్సిబుల్ గా ఉంటాయి. అలా మరోసారి ‘దిల్ దియా’తో కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించానికి రెడీ అయ్యారు. చైత‌న్య‌రావు న్యూ అవ‌తార్‌లో కనిపిస్తాడు. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం లాంటి ఎలిమెంట్స్‌ను ప్రధానంగా సినిమా ఉంటుంది. స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.