Thalaivar 173: రజనీ-కమల్ మూవీ అప్డేట్.. యంగ్ డైరెక్టర్‌కి ఛాన్స్.. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా(Thalaivar 173) నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
official update on Rajinikanth Thalaivar 173 movie
- రజనీకాంత్ 173వ మూవీ షురూ
- బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్
- 2027 సంక్రాంతికి రిలీజ్
Thalaivar 173: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ మూవీ బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా, యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ రాజ్‌కమల్ ఫిల్మ్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కి ‘ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటారు’ అనే ట్యాగ్ లైన్ ని యాడ్ చేశారు. దీంతో, ఈ పోస్టర్ కాస్త వైరల్ గా మారింది.
Roshan Meka: రోషన్ హీరోగా స్పై థ్రిల్లర్ మూవీ.. హిట్ దర్శకుడు హిట్ ఇస్తాడా!
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా(Thalaivar 173)ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. దీంతో, రజినీకాంత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఈ ప్రాజెక్టు దర్శకుడు సుందర్.సి తో మొదలయ్యింది.
కానీ, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో, రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశం దర్శకుడు శిబి చక్రవర్తికి లభించింది. ఈ దర్శకుడు 2022లో శివ కార్తికేయన్ తో చేసిన డాన్ మూవీ మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

official update on Rajinikanth Thalaivar 173 movie
